కార్తికేయ చిత్రానికి మంచి స్పందన

కార్తికేయ చిత్రానికి మంచి స్పందన

Published on Oct 26, 2014 12:50 AM IST

Karthikeya
‘స్వామి రారా’ విజయం తరువాత కాస్త విరామం తీసుకుని నిఖిల్ కార్తికేయ చిత్రంతో మనముందుకు వచ్చాడు. ట్రైలర్ తోనే అందరినీ ఆకర్షించిన ఈ చిత్రం పలుమార్లు వాయిదాపడి నేడు విడుదలైంది. ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లబిస్తుందని సమాచారం

మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని, పెట్టిన ఖర్చు తిరిగిరావడంలో ఎటువంటి డోకా లేదని సమాచారం. దర్శకుడు చందూ మొండేటి తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నట్టు తెలుస్తుంది. శేఖర్ చంద్ర అందించిన హంటింగ్ మ్యూజిక్ సినిమాకు మరొక బలం. ఈ వారాంతరం పెద్దగా కాంపిటేషన్ లేకపోవడంతో ఈ చిత్రం విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా వున్నట్టు సినిమా పండితులు జోస్యం చెబుతున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు