చివరి దశకు మనకు చేరుకుంటున్న ‘కిక్ 2’

చివరి దశకు మనకు చేరుకుంటున్న ‘కిక్ 2’

Published on Mar 2, 2015 8:25 AM IST

Kick2
మాస్ మహారాజ రవితేజ కెరీర్లో కమర్షియల్ గానే కాకుండా తన కెరీర్ కి బిగ్గెస్ట్ బూస్టప్ ఇచ్చిన సినిమా ‘కిక్’. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రవితేజ మాత్రమే ఆ సినిమా చేయగలడని అన్నారు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కి కొనసాగింపుగా ఆ పార్ట్ లోని రవితేజ – ఇలియానాల వారసుడి కథని ఆధారం చేసుకొని ‘కిక్ 2’ సినిమాని చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రసతుట సమాచారం షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. ఈ చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ ఈ సినిమా షూటింగ్ ఆ ఫినిష్ చేసి మే మొదటి వారంలో సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవలే ఈ చిత్ర టీం రవితేజ – రవికిషన్ మధ్య వచ్చే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేసారు. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. కిక్ సినిమాలనే ఈ సినిమాలో కూడా ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ ఉంటూనే థ్రిల్ చేసే అంశాలు కూడా ఉంటాయని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు