ఇంటర్వ్యూ : నిఖిల్ – ‘కిరాక్ పార్టీ’లో చేసిన క్యారెక్టరే నా కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ !

ఇంటర్వ్యూ : నిఖిల్ – ‘కిరాక్ పార్టీ’లో చేసిన క్యారెక్టరే నా కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ !

Published on Mar 6, 2018 2:26 PM IST

వరుస హిట్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో నిఖిల్ చేసిన తాజా చిత్రం ‘కిరాక్ పార్టీ’. శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 16న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం.

ప్ర) విడుదల దగ్గరపడుతోంది. ఏమైనా కంగారుపడుతున్నారా ?
జ) ఇది నా 15వ సినిమా. ప్రతి సినిమా విడుదల దగ్గరపడేకొద్దీ నాలో కొంత కంగారు మొదలవుతుంది. ప్రతి సినిమా విడుదల నాకు మొదటి సినిమా విడుదలలానే ఉంటుంది.

ప్ర) ఈ సినిమా కెరీర్ పరంగా మీకు సహాయపడుతుందని అనుకుంటున్నారా ?
జ) ‘హ్యాపీ డేస్’ తరవాత నేను చేసిన ఫుల్ లెంగ్త్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా ఇదే అవ్వడంతో నాకిది స్పెషల్ సినిమాగా మారింది. ఇక కెరీర్ పరంగా కూడ ఈ సినిమా నాకు బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను.

ప్ర) ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతోంది ?
జ) ఇందులో నాది ఒక స్టూడెంట్ లీడర్ పాత్ర. ఇప్పటి వరకు నేను చేసిన అన్ని పాత్రలోకి ఇదే బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పగలను.

ప్ర) సినిమా కథేమిటి ?
జ) అంటే మొదటి సంవత్సరం ఇంజనీరింగ్లో చేరిన ఒక సాదీ సీదా కుర్రాడు చివరి సంవత్సరానికి వచ్చేటప్పటికి స్టూడెంట్ లీడర్ ఎలా అయ్యాడు అనేది ఇందులో చూపిస్తాం.

ప్ర) ఈ సినిమాలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశం ?
జ) ఇది ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్. అంతేగాక ఇంజనీరింగ్ అంటే చాలా సాధారణమైపోయిన ఈరోజుల్లో నిరుద్యోగ సమస్య ఎలా ఉంది, దానితో పాటే ఒక అమ్మాయి గురించి చేసే చెడు కామెంట్స్ భవిష్యత్తులో ఆమెపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి వంటి అంశాలని కూడా చూపడం జరిగింది. అవే నాకు బాగా
నచ్చాయి.

ప్ర) ఒరిజినల్ కన్నడ సినిమాకి ఈ తెలుగు రీమేక్ కి ఏమైనా తేడాలుంటాయా ?
జ) పెద్దగా తేడాలేం ఉండవు. కానీ కన్నడ వెర్షన్ రన్ టైమ్ 3 గంటలుంటుంది. కానీ తెలుగులో రెండు గంటల 25 నిముషాలు ఉంటుంది. మనకు అవసరంలేని కొన్ని కామెడీ సీన్స్, ఐటమ్ సాంగ్స్ తొలగించాం.

ప్ర) మీ నిర్మాత దర్శకత్వంలో ఇన్వాల్వ్ అయ్యారని వార్తలొచ్చాయి ?
జ)
అబ్బే .. అలాంటిదేం లేదు. నాకు తెలిసి ఆయన సినిమా కొబ్బరికాయ కొట్టే మొదటి రోజు, ఆ తరవాత మధ్యలో ఒకసారి మాత్రమే సెట్స్ కు వచ్చారు.

ప్ర) నిర్మాత అనిల్ సుంకర దర్శకత్వంలో ఇన్వాల్వ్ అయ్యారని వార్తలొచ్చాయి ?
జ) అబ్బే .. అలాంటిదేం లేదు. నాకు తెలిసి ఆయన సినిమా కొబ్బరికాయ కొట్టే మొదటి రోజు, ఆ తరవాత మధ్యలో ఒకసారి మాత్రమే సెట్స్ కు వచ్చారు.

ప్ర) ఆయనకు, దర్శకుడికి మధ్యన విభేదాలు వచ్చాయని అన్నారు ?
జ) అది కూడ రూమరే. ఎలాంటి ఇబ్బందీ లేకుండా సినిమా పూర్తిచేసుకున్నాం.

ప్ర) చందూ మొండేటి, సుధీర్ వర్మలు మీ సినిమాకు పనిచేయడం పట్ల మీ ఫీలింగ్ ?
జ) వాళ్లిద్దరూ నాకు, శరన్ కొప్పిశెట్టికి మంచి మిత్రులు. బాగా సపోర్ట్ చేశారు. ఒకవైపు వాళ్ళ సినిమాలతో బిజీగా ఉంటూనే మా సినిమాకి కూడ టైమ్ కేటాయించడమనేది నిజంగా గొప్ప విషయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు