సిక్స్ ప్యాక్ ప్రదర్శించనున్న ఎన్టీఆర్ !

సిక్స్ ప్యాక్ ప్రదర్శించనున్న ఎన్టీఆర్ !

Published on May 19, 2018 12:35 PM IST

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో రూపొందుతున్న సినిమా యొక్క ఫస్ట్ లుక్, టైటిల్ ఈరోజు సాయంత్రం విడుదలకానున్నాయి. ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుని మరీ కొత్త లుక్ ట్రై చేయడంతో సినిమాలో ఆయన ఎలా కనిపిస్తారో చూడాలని అభిమానులు తొందరడుతున్నారు.

ఇదిలా ఉంటే ఈరోజు విడుదలకానున్న ఫస్ట్ లుక్ పోస్టర్ పై ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిస్తారని తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ అభిమానులు మాత్రం ఈ వార్త పట్ల చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అంతేగాక తారక్ ఈ సినిమా టైటిల్ విషయంలో కూడ ‘అ’ సెంటిమెంట్ ఫాలో అవుతారని ‘అరవింద సమేత రాఘవ’ లేదా ‘అరవింద సమేత సిద్దార్థ’ అనే టైటిల్ ను పెడతారని అంటున్నారు. మరి ఈ వార్తలన్నిటిలో ఏమాత్రం నిజముందో తెలియాలంటే సాయంత్రం 4 గంటల 50 నిముషాల వరకు ఎదురుచూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు