రజినీకాంత్ ‘లింగ’ ఆడియో రిలీజ్ డేట్

రజినీకాంత్ ‘లింగ’ ఆడియో రిలీజ్ డేట్

Published on Oct 24, 2014 1:00 PM IST

Linga
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లింగ’. ఒక సాంగ్ తప్ప మిగతా షూటింగ్ అంతా పూర్తయ్యింది. ఆ మిగిలిన పాటని కూడా త్వరలో షూట్ చేయనున్నారు. రజినీకాంత్ బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఆడియో రిలీజ్ పై పలుసార్లు పలు తేదీలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ కచ్చితమైన సమాచారం మాత్రం లేదు.

తాజా సమాచారం ప్రకారం ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోని చిల్డ్రన్స్ డే కానుకగా నవంబర్ 14న రిలీజ్ చేయనున్నారు. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నాడు. ‘ముత్తు’, ‘నరసింహా’ లాంటి సినిమాల తర్వాత రజినీకాంత్ – కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు