సంచలనం సృష్టిస్తున్న మహేంద్ర బాహుబలి ఫస్ట్ లుక్
Published on Oct 22, 2016 5:00 pm IST

baahubali-2
‘బాహుబలి’ అభిమానులు, రాజమౌళి అభిమానులు, రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం వచ్చింది. కొద్దిసేపటి ముందే దర్శక ధీరుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా ముంబై నుండి ‘బాహుబలి 2’ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. దీంతో ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మాధ్యమాల్లో మహేంద్ర బాహుబలిగా ఉన్న ప్రభాస్ లుక్ ను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

సాయంత్రం 4 గంటలకు ఫస్ట్ లుక్ విడుదలని చెప్పడంతో మధ్యాహ్నం నుండే అభిమానాలు సోషల్ సైట్లలో ఆత్రంగా ఎదురుచూస్తూ కూర్చున్నారు. దేశ వ్యాప్తంగా బాహుబలి 2 ఫస్ట్ లుక్ ను ట్రెండ్ చేశారు. కానీ 4 గంటలకు లుక్ ను విడుదల చేయలేదు. అలాగే అభిమానులను ఊరించి చివరికి 5 గంటలు దాటిన తరువాత వదిలారు. ముంబైలో ఎంఏఎంఐ ఫస్ట్ లుక్ ను విడుదల చేయగానే ప్రేక్షకులు, ఇతర సభ్యులంతా స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ప్రస్తుతం అమరేంద్ర బాహుబలి దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాడు.

 
Like us on Facebook