నేల టికెట్ లో మాళవిక శర్మ పాత్ర ఇదే !

నేల టికెట్ లో మాళవిక శర్మ పాత్ర ఇదే !

Published on Mar 18, 2018 4:09 PM IST


కల్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న నేలటికెట్ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఉగాది సందర్భంగా నిన్న విడుదల చేసారు. లుక్ విడుదల అయ్యాక మంచి రెస్పాన్స్ లభించింది. మాళవిక శర్మ మొదటిసారి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. శక్తి కాంత్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా చోటా కెప్రసాద్ ఎడిటర్ గా పనిచేస్తున్నాడు.

తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో మాళవిక శర్మ మెడికల్ కాలేజీ స్టూడెంట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మే చివరి వారంలో సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు