డిసెంబర్ లో రానున్న లారెన్స్ ‘ముని 3’

డిసెంబర్ లో రానున్న లారెన్స్ ‘ముని 3’

Published on Sep 1, 2014 1:53 PM IST

Muni3
రాఘవ లారెన్స్ మొదట కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకొని ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా మారి తర్వాత దర్శకుడిగా మారి తన టాలెంట్ ని నిరూపించుకున్నాడు. రాఘవ లారెన్స్ దర్శకుడిగా, నటుడిగా చేసిన హర్రర్ కామెడీ ‘ముని’ సినిమాకి మంచి పేరొచ్చింది. ఈ సినిమాకి సీక్వెల్ గా కాంచన వచ్చి పెద్ద హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ రెండింటికి సీక్వెల్ గా ‘ముని 3 – గంగ’ తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే.

తాజాగా ఈ చిత్ర టీం ఈ సినిమా విశేషాలను తెలుపుతూ ‘ ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఈ సినిమాకి చాలా కీలకమైన క్లైమాక్స్ ఎపిసోడ్ ని 20 రోజులు షూట్ చేసాం. గత సినిమాలకంటే ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే రిలీజ్ కాస్త ఆలస్యమవుతోంది. సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నామని’ తెలిపారు.

రాఘవ లారెన్స్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. బెల్లంకొండ సురేష్ నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు