సుధీర్ బాబు “హరోమ్ హర” నుండి మురుగడి మాయ సాంగ్ రిలీజ్!

hato

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భం గా హరోమ్ హర నిర్మాతలు మురుగడి మాయ అనే కొత్త పాటను రిలీజ్ చేస్తూ, సుధీర్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టైటిల్ సూచించినట్లుగా, ప్రపంచంలో జరిగే ప్రతి దానికి కారణమైన మురుగన్ యొక్క అపారతను పాట నిర్వచిస్తుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ సాంగ్ లో సుధీర్ బాబు మరియు సునీల్‌ల స్నేహాన్ని చూపిస్తుంది.

రఘు కుంచె ఆ పాటను అద్భుతంగా పాడారు. భరద్వాజ పాత్రుడు కుప్పం యాసలో సాహిత్యం రాశారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సెహరి ఫేమ్‌ జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు హరోమ్ హర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మాళవిక శర్మ కథానాయిక గా నటిస్తుంది. మే 31న సూపర్‌స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా హరోమ్ హర ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version