3 నెలల్లో 85 స్క్రిప్ట్స్ విన్నాను – హీరో నాని

3 నెలల్లో 85 స్క్రిప్ట్స్ విన్నాను – హీరో నాని

Published on Sep 16, 2014 4:09 PM IST

Nani1
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో హీరోగా ఎదిగిన యంగ్ & టాలెంటెడ్ హీరో నాని నటించిన చివరి సినిమాలు ఆశించిన విజయం సాదించలేదు. ‘ఈగ’ తర్వాత హిట్ లేదు. అయినా వాటిలో నటించినందుకు నేను భాదపడడం లేదు. ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’, ‘పైసా’, ‘ఆహా కళ్యాణం’ సినిమాల రిజల్ట్ తన ఆలోచనలలో, కథల ఎంపికలో మార్పు తీసుకొచ్చిందని నాని అంటున్నాడు.

‘ నేను వినోదాత్మక సినిమాలలో నటించిన ప్రతిసారి ప్రేక్షకులు ఆదరించారు. ‘అష్టా చమ్మా’, ‘పిల్ల జమిందార్’, ‘అలా మొదలైంది’ సినిమాలు మంచి విజయం సాదించాయి. కామెడీ వదలి ఇతర జోనర్ లలో చేసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఆ తర్వాత 3 నెలల్లో 85 స్క్రిప్ట్స్ వరకు విన్నాను. చాలా మంది దర్శకులు నాతో వర్క్ చేయాలని వస్తున్నారు. సంతోషంగా ఉంది. ప్రస్తుతం 3 సినిమాలను అంగీకరించాను, ఇకపై నటించే సినిమాలలో ప్రేక్షకులు నా నుండి ఆశించే అంశాలు (కామెడీ) ఉండేలా చూసుకుంటాను. అని ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు