కొత్త సినిమా గురించి సరికొత్త విశేషాల్నిబయటపెట్టిన నాని !
Published on Jul 4, 2017 6:32 pm IST


‘నిన్ను కోరి’ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్న నాని తన తర్వాతి సినిమాను మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా జానర్ చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. తాజాగా జరిగిన ‘నిన్ను కోరి’ ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన నాని ఈ చిత్ర విశేషాల్ని బయటపెట్టారు.

పూర్తిగా కొత్తగా జానర్లో ఉండనున్న ఈ సినిమాను ‘నిన్ను కోరి’ విడుదలైన ఒక వారం తర్వాత లాంచ్ చేస్తామని, టైటిల్ కూడా వెరైటీగా ఉంటుందని అన్నారు. అలాగే చిత్రీకరణను సెప్టెంబర్లో మొదలుపెడతామని కూడా తెలిపారు. ఇకపోతే నాని దిల్ రాజు ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.

 
Like us on Facebook