‘డీజే’ కు మైలేజ్ పెంచుతున్న నెగెటివ్ పబ్లిసిటీ !

‘డీజే’ కు మైలేజ్ పెంచుతున్న నెగెటివ్ పబ్లిసిటీ !

Published on Jun 28, 2017 9:10 PM IST


ఏదైనా సినిమాకు నెగెటివ్ పబ్లిసిటీ వచ్చిందంటే ఆ సినిమా కలెక్షన్ల మీద చాలా ప్రభావముంటుంది. అందుకు ఈ మధ్య విడుదలైన కొన్ని పెద్ద హీరోల సినిమాలే ప్రత్యక్ష నిదర్శనాలు. కేవలం సోషల్ మీడియాలో నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడం వలన కాస్తో కూస్తో ఆడవలసిన ఆ చిత్రాలు పరాజయాలుగా నిలిచి నమ్ముకున్న వారికి భారీ నష్టాల్ని మిగిల్చాయి. అంతటి ప్రమాదకరమైంది నెగెటివ్ పబ్లిసిటీ. కానీ విచిత్రంగా బన్నీ ‘డీజే’ విషయంలో మాత్రం నెగెటివ్ పబ్లిసిటీయే సినిమాకు కావాల్సినంత క్రేజ్ తెచ్చిపెడుతోంది.

నిత్యం సోషల్ మీడియాలో, టీవీ చానెళ్లలో ట్రెండ్ అవుతూ జనాల దృష్టిలో ఉంటోంది. అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కినప్పటికీ ఊహించని విధంగా చాలా వరకు క్రిటిక్స్ ను మెప్పించలేకపోవడంతో సినిమాకు మిశ్రమ స్పందన బయలుదేరింది. దాన్ని అడ్డం పెట్టుకుని కొందరు కావాలనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభించారు. కానీ సినిమా వసూళ్లు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే ఏపి, తెలంగాణల్లో రూ.47.21 కోట్లు రాబట్టిన ఈ సినిమా మంచి లాభాలను ఆర్జించేలా కనిపిస్తోంది.

ఇక చిత్ర టీమ్ కూడా ఈ నెగెటివ్ పబ్లిసిటీని, తాజాగా ఎదురైన పైరసీ సమస్యను అరికట్టడానికి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు