ఎన్టీఆర్ – పూరి సినిమా ఓపెనింగ్ ముహూర్తం ఫిక్స్ అయ్యింది.

ఎన్టీఆర్ – పూరి సినిమా ఓపెనింగ్ ముహూర్తం ఫిక్స్ అయ్యింది.

Published on Jul 30, 2014 10:59 AM IST

jr-ntr-puri-jaganath

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో తెరకేక్కబోయే కొత్త సినిమా ఓపెనింగ్ ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ శుక్రవారం, ఆగస్ట్ 1న ఉదయం 7 గంటలకు పూరి జగన్నాధ్ కొత్త ఆఫీసు కేవ్ లో పూజా కార్యక్రమాలతో లాంచనంగా సినిమా ప్రారంభం అవుతుంది. ఈ చిత్రాన్ని పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.

వక్కంతం వంశి ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ చిత్రానికి ‘రుబాబు’, ‘కుమ్మేస్తా’ వంటి టైటిల్స్ పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. ఇంకా దర్శకనిర్మాతలు టైటిల్ ఫిక్స్ చేయలేదని సమాచారం. పూరి సినిమా ఓపెనింగ్ జరిగిన రోజు సాయంత్రం ‘రభస’ ఆడియో వేడుక జరగనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు