శరవేగంగా జరుగుతున్న ‘ఐ’ పోస్ట్ ప్రొడక్షన్

శరవేగంగా జరుగుతున్న ‘ఐ’ పోస్ట్ ప్రొడక్షన్

Published on Oct 22, 2014 3:00 PM IST

i-poster1

ఓ మెసేజ్ ని కమర్షియల్ గా చెప్పడంలో సక్సెస్ అయిన డైరెక్టర్ శంకర్ తన్న కెరీర్లో మొదటిసారి ట్రై చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు అభిమానులు మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికైతే ఈ చిత్ర టీం నవంబర్ లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసుకుంటున్నారు కానీ సరైన డేట్ మాత్రం అనౌన్స్ చెయ్యలేదు. విజువల్స్ పరంగా ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళేలా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. విక్రమ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించిన ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. పలు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ఎఆర్ రెహమాన్ కూడా రీ రికార్డింగ్ మొదలు పెట్టాడు.

తెలుగులో కూడా ‘ఐ’ పేరుతోనే రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగు ఆడియోని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు