పోర్చుగల్ పుట్ బాల్ కోర్టులో రామ్-రకుల్ ప్రీత్ ల రొమాన్స్

పోర్చుగల్ పుట్ బాల్ కోర్టులో రామ్-రకుల్ ప్రీత్ ల రొమాన్స్

Published on Mar 4, 2015 10:46 PM IST

Pandaga-chesko
ఎనర్జిటిక్ హీరో రామ్ – టాలీవుడ్ గోల్డెన్ లెగ్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న సినిమా ‘పండగ చేస్కో’. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం ఒక 5 ఒర్జుల ముందే మిగిలి ఉన్న సాంగ్స్ షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్ళారు. ప్రసతుతం ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ సాంగ్ ని పోర్చుగల్ లో షూట్ చేస్తున్నారు. పోర్చుగల్, లిబ్సన్ ప్రాంతంలో బాగా ఫేమస్ అయిన బెన్ఫికా ఫుడ్ బాల స్టేడియంలో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. స్పెయిన్ లోని రిచ్ లోకేషన్స్ లో తీస్తున్న సాంగ్స్ విజువల్ గా చాలా గ్రాండ్ గా ఉంటాయని ఈ చిత్ర టీం అంటోంది.

అమెరికా నుండి ఇండియా వచ్చిన స్టైలిష్ ఎన్నారై యువకుడి పాత్రలో రామ్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు సోనాల్ చౌహాన్ కూడా మరో హీరోయిన్ గా కనిపించనుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలో సాంగ్ షూటింగ్ ని ఫినిష్ చేసి ఏప్రిల్ లో ఈ సినిమాని రిలీజ్ చేసేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి ‘పండగ చేస్కో’ను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు