“ది కేరళ స్టోరీ” తర్వాత ఆదాశర్మ డిజాస్టర్ కి ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

“ది కేరళ స్టోరీ” తర్వాత ఆదాశర్మ డిజాస్టర్ కి ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

Published on May 8, 2024 1:00 PM IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ఆదాశర్మ మెయిన్ లీడ్ లో ఇటీవల నటించిన చిత్రాల్లో సెన్సేషనల్ హిట్ చిత్రం “ది కేరళ స్టోరీ” కోసం తెలిసిందే. అయితే థియేటర్స్ లో సంచలనం రేపిన ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కూడా అనేక కాంట్రవర్సీల తర్వాత ఎట్టకేలకి జీ 5 లో వచ్చింది.

అయితే ఈ సినిమా రాక తోనే ఆదాశర్మ నటించిన మరో నిజ జీవిత ఘటనలు పైగా కేరళ స్టోరీ మేకర్స్ తీసిన సినిమానే “బస్టర్ ది నక్సల్ స్టోరీ” (Buster The Naxal Story OTT) ని కూడా గట్టిగా ప్రమోట్ చేశారు. కేరళ స్టోరీ ఓటిటి రిలీజ్ లో కూడా ఆ ట్రైలర్ ని పెట్టారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. కేరళ స్టోరీ తరహాలోనే ఈ సినిమా కూడా హిట్ అవుతుంది అనుకుంటే ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాని కూడా జీ 5 వారే సొంతం చేసుకోగా ఇందులో ఈ మే 17 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సినిమాని కూడా సుదీప్తో సేన్ తెరకెక్కించగా సన్ షైన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు. ఈ చిత్రం మే 17 నుంచి తెలుగు సహా హిందీలో స్ట్రీమింగ్ కి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు