ఫోటో మూమెంట్ : పవర్ స్టార్‌తో బర్త్‌డే బాయ్!

ఫోటో మూమెంట్ : పవర్ స్టార్‌తో బర్త్‌డే బాయ్!

Published on Aug 1, 2015 12:52 PM IST

pawan-kalyan
రవితేజ ‘పవర్’ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు బాబీ, ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకొని టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. ‘అత్తారింటికి దారేది’ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘సర్దార్’ టైటిల్‌తో పవన్ చేస్తోన్న ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళకముందే వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఈమధ్యే మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

గత కొన్నాళ్ళుగా రాజకీయపరమైన కార్యక్రమాలతో బిజీ ఉన్న పవన్, నిన్ననే ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఇక నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్న దర్శకుడు బాబీ ఈ ఉదయం సర్దార్ సెట్లో సరదాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‍తో ఓ ఫోటో దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పవర్ స్టార్ దగ్గర్నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని బాబీ ఈ సందర్భంగా తెలిపారు. పై ఫోటో బాబీ, పవన్ కళ్యాణ్ కలిసి దిగిన ఫోటోను చూడొచ్చు. గత కొద్దికాలం వరకూ గడ్డంతో కనపడిన పవన్, ఈ ఫోటోలో క్లీన్ షేవ్‌లో దర్శనమివ్వడం ఆసక్తికర అంశం. ఇక దర్శకుడు బాబీకి 123 తెలుగు తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్దార్ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు