అభిమానులతో పుట్టినరోజు జరుపుకున్న పూరీ!

puri-birthday
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు పూరీ జగన్నాథ్ స్థాయేంటో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన మాస్ పంచ్‌తో స్టార్ హీరోలందరికీ తిరుగులేని విజయాలను అందించిన ఆయన, నేడు తన 50వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఇక ఈ ఏడాది ఆయన తన పుట్టినరోజు వేడుకలను అభిమానులతో ప్రత్యేకంగా తన నివాస గృహంలోనే జరుపుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. పూరీ ఇంటికి పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు, తమ అభిమానాన్ని చాటుతూ రక్తదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.

పూరీ జగన్నాథ్ కేవ్స్‌లోనే ఈ రక్తదాన కార్యక్రమం కూడా జరిగింది. ఇక తన పుట్టినరోజు వేడుకకు వచ్చిన అభిమానులతో ప్రత్యేకంగా ముచ్చటించిన ఆయన, వారికి థ్యాంక్స్ తెలిపారు. ఇక పూరీ సినిమాల విషయానికి వస్తే ఆయన కొత్త సినిమా ఇజం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటూ వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది.

 

Like us on Facebook