రిలీజ్‌కు సిద్ధమైన నారాయణమూర్తి కొత్త సినిమా!

రిలీజ్‌కు సిద్ధమైన నారాయణమూర్తి కొత్త సినిమా!

Published on Nov 29, 2015 2:22 AM IST

narayanmurthy
తెలుగు సినీ పరిశ్రమలో విప్లవ సినిమాల కథానాయకుడంటే వినిపించే ఒకే ఒక్క పేరు.. ఆర్. నారాయణ మూర్తి. ప్రజల బాధలనే తన కథలుగా చేసుకొని ఎన్నో విప్లవ చిత్రాలను తెరకెక్కించిన ఆయన తాజాగా ‘దండకారణ్యం’ పేరుతో మరో విప్లవ సినిమాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్.నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, ఎడిటింగ్, కొరియోగ్రఫీ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సంగీతం.. ఇలా ఇన్ని బాధ్యతలనూ నారాయణ మూర్తే చేపట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు.

ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జనవరి నెలలో ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకు రావాలనుకుంటున్నట్లు తెలుపుతూ నారాయణమూర్తి ఈ ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రస్తుతం ప్రభుత్వాలు బాక్సైట్ తవ్వకాలు, గనుల తవ్వకాల వల్ల ఆదివాసీల మనుగడే కష్టమైపోయింది. వారి కష్టాలను కళ్ళముందుకు తెస్తూ, ఆది వాసీల హక్కుల గురించి తెలుపుతూ నేను చేసినే ప్రయత్నమే ఈ దండకారణ్యం. గద్దర్, వందేమాతరం శ్రీనివాస్ పాడిన పాటలు అందరినీ అలరిస్తాయి” అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు