రాశీ ఖన్నా పెర్ఫార్మెన్స్ కు భారీగా ప్రశంసలు !

తెలుగులో ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించినా పెద్దగా ప్రశంసలందుకోలేకపోయిన నటి రాశీ ఖన్నా మలయాళంలో చేసిన మొదటి సినిమాతోనే బోలెడు ప్రశంసలతో పాటు మంచి మంచి ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఆమె మొదటి మలయాళ సినిమా ‘విలన్’ గత్ శుక్రవారం విడుదలలో మంచి రిపోర్ట్స్ తో పాటు భారీ ఓపెనింగ్స్ సాధించి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

దీంతో మొదటి ప్రయత్నమే ఇంతటి సక్సెస్ అయినందుకు ఆనందపడిపోతున్న రాశీఖన్నా ‘సుప్రీమ్’ తర్వాత తనకు పెర్ఫార్మెన్స్ పరంగా అంతటి పేరు తీసుకొచ్చిన చిత్రం ఇదేనని, ‘ఊహలు గుస గుసలాడే’ విజయం సమయంలో ఎలాంటి ఆనందం కలిగిందో ఇప్పుడు కూడా అదే ఆనందం కలుగుతొందని, డైలాగ్స్ పరంగా, లుక్ పరంగా అందరూ ఇంప్రెస్ అయ్యారని, మంచి మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

 

Like us on Facebook