మొబైల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చరణ్ !

మొబైల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చరణ్ !

Published on May 24, 2018 5:00 PM IST

బోలెడంత స్టార్ డమ్ ఉన్నా గత కొన్నేళ్లుగా ఆ స్టార్ డమ్ కు సరిపడా హిట్ అందుకోలేకపోయిన రామ్ చరణ్ ఈ ఏడాది మాత్రం ‘రంగస్థలం’తో కెరీర్ మొత్తం గుర్తుండిపోయే సాలిడ్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం రూ.200 కోట్లతో నాన్ బాహుబలి రికార్డుల్ని సృష్టించడంతో చరణ్ ఫేమ్ ఇంకాస్త పెరిగిపోయింది. అడ్వేర్టైజింగ్ రంగంలో సైతం ఆయన బ్రాండ్ వాల్యూ రెట్టింపైంది.

తాజాగా ఆయన కొత్తగా ప్రారంభమైన స్మార్ట్ ఫోన్ల సంస్థ ‘హ్యాపీ మొబైల్స్’కు ప్రచారకర్తగా వ్యవహరించడానికి ఒప్పుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ వార్త అధికారికంగా కన్ఫర్మ్ అయింది. ఈ డీల్ కోసం చరణ్ పెద్ద మొత్తంలోనే పారితోషకాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమాలో నటిస్తున్న చరణ్ త్వరలో రాజమౌళి మల్టీ స్టారర్ ను మొదలుపెట్టనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు