తన గురించి వస్తున్న రూమర్లను కొట్టిపడేసిన రానా

తన గురించి వస్తున్న రూమర్లను కొట్టిపడేసిన రానా

Published on Sep 29, 2016 3:00 PM IST

rana1
యంగ్ హీరో రానా గురించి కొన్నిరోజులుగా ఓ ఆసక్తికరమైన వార్త సినీ సర్కిల్స్ లో బాగా నానుతూ వస్తోంది. రానా త్వరలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి ఓ సినిమా చేయనున్నాడని, అది యుద్ధ నైపథ్యంలో సాగే చిత్రంగా ఉండబోతోందని అందరూ అన్నారు. వార్తను కన్ఫార్మ్స్ చేసేశారు కూడ. కానీ రానా పుకార్లేనని కొట్టి పడేశాడు.

తనకు మోహన్ లాల్ గారితో సినిమా చేయడం పెద్ద గౌరవంగా భావిస్తానని, కానీ ఇప్పుడైతే ఆయనతో ఎలాంటి సినిమా ప్లాన్ చేయలేదని, ఈ వార్తను తెలియకుండా క్రియేట్ చేశారని ట్విట్టర్ లో ఆ వార్తను పోస్ట్ చేసిన వారికి బదులు చెబూతూ ట్వీట్ చేశారు. ఇకపోతే రానా ప్రస్తుతం 1971 లో ఇండియా – పాక్ ల మధ్య జరిగిన సబ్ మెరైన్ వార్ నైపథ్యంలో ‘ఘాజి’ అనే సినిమాలో నటిస్తున్నారు. తాప్సి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఒకేసారి 2ఫిబ్రవరి 4న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు