లాక్ అయిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ రన్ టైం

లాక్ అయిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ రన్ టైం

Published on Feb 11, 2016 8:35 AM IST

krishna-gadi-veera-prema-ga
ఒక అందమైన పెయింటింగ్ లాంటి చిత్రమైన ‘అందాల రాక్షసి’తో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడుగా పరిచయమైన హను రాఘవపూడి నుంచి వస్తున్న రెండవ సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. ‘భలే భలే మగాడివోయ్’ లాంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ తర్వాత నాచురల్ స్టార్ నాని నుంచి వస్తున్న ఈ సినిమా సెన్సార్ నుంచి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకొని ఫిబ్రవరి 13న అనగా రేపు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈ చిత్ర టీం సినిమాని ప్రమోట్ చేస్తూ రేపు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రిజల్ట్ వస్తుందా అనే దాని కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ మధ్య కాలంలో షార్ట్ రన్ టైంకి దర్శకులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ హను మాత్రం కథ డిమాండ్ మేరకు మనకు రెండున్నర గంటల సినిమానే అందిస్తున్నాడు. ఫైనల్ గా ఈ చిత్ర టీం 148 నిమిషాల రన్ టైంని లాక్ చేసింది. షార్ట్ రన్ టైం కాకపోయినా సినిమా మాత్రం ఎక్కడా బోర్ కొట్టాడని అంటున్నారు. అలాగే నాని పాత్ర మరియు పిల్లలతో కలిసి నాని చేసిన సీన్స్ అన్నీ బాగా నవ్విస్తాయని సమాచారం. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమా ద్వారా మెహరీన్ హీరోయిన్ గా పరిచయం కానుంది. మరి భారీ అంచనాల నడుమ నాని కెరీర్లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు