‘సామి’ మోషన్ పోస్టర్ విడుదల !

‘సామి’ మోషన్ పోస్టర్ విడుదల !

Published on May 23, 2018 8:04 PM IST

చియాన్ విక్రమ్,కీర్తి సురేష్ జంటగా తమిళ భాషలో తెరకెక్కుతున్న చిత్రం సామీ స్క్వేర్.ఈ చిత్రాన్ని ఔరా సినిమాస్ ,పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకం ఫై కావ్య వేణుగోపాల్ , బెల్లం రామకృష్ణ రెడ్డి సంయుక్తంగా తెలుగులో ‘సామి’ గా ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు .
సామి చిత్ర మోషన్ పోస్టర్ ని కొద్దీ సేపటికి క్రితం రిలీజ్ చేసారు.ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే మరొక సారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విక్రమ్ అదరగొట్టనున్నాడని తెలుస్తుంది. సింగం మూవీ సిరీస్ కి దర్శకత్వం వహించిన హరి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
యాక్షన్ సినిమాలని తెరకెక్కిన్చడంలో మంచి పట్టున్న హరి మరొకసారి అదే ఫార్ములా తో రానున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు బాబీ సింహ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.

మోషన్ పోస్టర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు