లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసిన స్టార్ హీరోయిన్ !
Published on Apr 17, 2018 5:29 pm IST

దక్షిణాది స్టార్ హీరోయిన్లలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేసి పలు హిట్లను అందుకున్న ఆమె ప్రస్తుతం ‘కో కో’ అనే డార్క్ థ్రిల్లర్ చేస్తూనే ఇప్పుడు మరొక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తోంది.

అలాగే ఈ సినిమా మలయాళంలో ఉండబోతోందని, సినిమాకు ‘కొట్టయం కుర్బాన’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. మహేష్ వెట్టియార్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రంలో ఒక స్టార్ హీరో అతిధి పాత్రలో కనిపిస్తారట. ఆ హీరో ఎవరు, ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే వివరాలు త్వరలోనే తెలుయనున్నాయి. ఇకపోతే నయనతార ప్రస్తుతం చిరు ‘సైరా’ సినిమాలో నటిస్తూనే అజిత్ ‘విశ్వాసం’ సినిమాకు సిద్ధమవుతోంది.

 
Like us on Facebook