అమెరికాలో రికార్డు స్థాయిలో విడుదల అవుతున్న సూర్య సినిమా..!

అమెరికాలో రికార్డు స్థాయిలో విడుదల అవుతున్న సూర్య సినిమా..!

Published on Apr 28, 2016 1:00 PM IST

Suriya-24
సూర్య హీరోగా ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించిన ప్రయోగాత్మక సినిమా ’24’. ఈ సినిమా మే 6 న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అమెరికాలో విడుదల అవుతున్న స్క్రీన్ల సంఖ్యను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవల్సిందే. ఒక ప్రాంతీయ భాష సినిమాను అమెరికాలో విడుదల చేయాలంటే దొరికే స్క్రీన్లు తక్కువ. అయితే ’24’ సినిమాను మాత్రం అమెరికాలో రికార్డు స్థాయిలో తెలుగు, తమిళ వెర్షన్లు రెండింటినీ కలిపి 267 స్క్రీన్లలో విడుదల చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా విడుదల ముందురోజు అయిన మే 5వ తేదీన స్పెషల్ ప్రీమియర్లు వేయాలని కూడా ఈ సినిమా వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అమెరికాలో సినీ గెలాక్సీ ఇంక్ సంస్థ ఈ సినిమాను పంపిణీ చేస్తున్నది.

టైమ్ మిషన్ కాన్సెప్టు ఆధారంగా నడిచే ’24’ సినిమాలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య మూడు పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా సూర్య సొంత బ్యానర్ అయిన 2డి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు