టాక్ అఫ్ ది టౌన్ : ‘ఒక క్రిమినల్ ప్రేమ కథ’

Oka-Criminal-Premakatha
సమాజంలో అమ్మాయిలు ఎదుర్కుంటున్న సమస్యలపై తెరకెక్కించిన చిత్రం ‘ఒక క్రిమినల్ ప్రేమ కథ’. ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు పి సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం గురించి ప్రేక్షకులలో, టాలీవుడ్ వర్గాలలో ఆసక్తి నెలకొని ఉంది. ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ చిత్రంతో సమాజంలో జరుగుతున్న సమస్యలను సరికొత్త కోణంలో ఆవిష్కరించిన దర్శకుడు.. క్రిమినల్ ప్రేమ కథను ఎలా తీశారో అని. జూలై 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందు వస్తుంది.

‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ విమర్శకుల ప్రసంశలతో పాటు కలెక్షన్స్ కూడా బాగా రాబట్టింది. బోల్డ్ సినిమాగా పేరు తెచ్చుకుంది. అదే బాటలో ‘ఒక క్రిమినల్ ప్రేమ కథ’ కూడా విజయం సాదిస్తుందని చిత్ర బృందం ఆశిస్తున్నారు. మనోజ్ నందం, అనిల్ కళ్యాణ్, ప్రియాంక పల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని శ్రావ్య ఫిలింస్ పతాకంపై కృష్ణమూర్తి సమర్పణలో యక్కలి రవీంద్రబాబు నిర్మిస్తున్నారు.

 

Like us on Facebook