స్క్రీన్ మీద అల్లు అర్జున్ ఎనర్జీ భీభత్సంగా ఉంటుందన్న విలన్ !
Published on Nov 14, 2017 9:04 am IST

అల్లు అర్జున్ వక్కంతం వంశీ డైరెక్షన్లో ‘నా పేరు సూర్య’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం కీలకమైన యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీకి ప్రతి నాయకుడిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు ఠాకూర్ అనూప్ సింగ్ నటిస్తున్నాడు. ఈయన గతంలో ‘విన్నర్, రోగ్’ వంటి సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేశారు. నిన్ననే ఆయన తాలూకు షూటింగ్ మొదలైంది.

అల్లు అర్జున్ తో మొదటి సీన్ చేసి షూటింగ్ మొదలుపెట్టాను. మా ఇద్దరి ఎనర్జీ లెవెల్స్ స్క్రీన్ మీద గొప్ప స్థాయిలో ఉంటాయి అంటూ తన అనుభవాన్ని తెలిపాడు అనూప్. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీధర్, బన్నీ వాసులు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుదలచేయనున్నారు. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook