రాకింగ్ ఆల్బమ్ తో సిద్దమైన తమన్

thaman
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన ఎస్ఎస్ తమన్ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మ్యూజిక్ అందిస్తున్నాం అంటే మెగాస్టార్ చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకొని సాంగ్ కంపోజ్ చెయ్యాలి అన్నాడు. అదే తరహాలోనే తమన్ రామ్ చరణ్ కి కంపోజ్ చేసిన లేటెస్ట్ ఆల్బమ్ ‘బ్రూస్ లీ’. ది ఫైటర్ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం హైటెక్స్ లో జరుగుతోంది. ఈ సినిమా కోసం తమన్ సూపర్బ్ రాకింగ్ ఆల్బం ని తయారు చేసాడట.

ఇప్పటికే ఈ సాంగ్స్ ని విన్న కొంతమంది అందులో మూడు సాంగ్స్ వినగానే బాగా నచ్చేస్తాయని, చార్ట్ బస్టర్స్ అవుతాయని అంటున్నారు. ప్రస్తుతం తమన్ ఈ రాకింగ్ ఆల్బంతో సాయంత్రం స్టేజ్ మీద సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి సిద్దమయ్యారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుంది. నదియా, రావు రమేష్, కృతి కర్భంద ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. డివివి దానయ్య ఈ సినిమాకి నిర్మాత.

 

Like us on Facebook