ఇంటర్వ్యూ : మల్లినేని మారుతీ ప్రసాద్ – తండ్రి కోరికను నిజం చేయడానికి కొడుకు చేసే ప్రయత్నమే ఈ చిత్రం !

ఇంటర్వ్యూ : మల్లినేని మారుతీ ప్రసాద్ – తండ్రి కోరికను నిజం చేయడానికి కొడుకు చేసే ప్రయత్నమే ఈ చిత్రం !

Published on Oct 26, 2016 1:40 PM IST

aame-athadaithe-9
నూతన నిర్మాతలు మల్లినేని మారుతీ ప్రసాద్, నెట్టెం రాధాకృష్ణ లు సంయుక్తంగా కొత్త దర్శకుడు కె. సూర్యనారాయణలో దర్శకత్వంలో రూపొందించిన చిత్రమే ఈ ‘ఆమె.. అతడైతే’ చిత్రం. ఇప్పటీకే చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్దమవుతున్న ఈ చిత్రం గురించి విలేఖరులతో నిర్మాతలు చెప్పిన కొన్ని విశేషాలు…

ప్ర) మారుతీ ప్రసాద్ గారు అసలు మీ నైపథ్యం ఏమిటి ?
జ) నేను నెల్లూరులో చదువుకున్నాను. తరువాత ఓ ప్రయివేట్ బ్యాంకు లో ఉద్యోగం చేశాను. ప్రస్తుతం విజయవాడలో బిల్డర్ గా ఉన్నాను. మా స్నేహితుడు కె. సూర్యనారాయణ చెప్పిన కథ నచ్చడం వలన ఇలా సినీ నిర్మాణ రంగంలోకి వచ్చాను.

ప్ర) మీరు కొత్త వాళ్ళు కదా పరిశ్రమలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ?

జ) అబ్బే.. అలాంటిదేమీ లేదు. సినిమా మొదలైన దగ్గర్నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోలేదు. మా ప్రయాణం సాఫీగానే సాగిపోయింది.

ప్ర) అసలు ఈ సినిమా కథేమిటి ?

జ) తెలుగు మీడియంలో డిగ్రీ చదువుకున్న ఓ పల్లెటూరి యువకుడు చనిపోయిన తన తండ్రి కోరికను నిజం చేయడానికి అమ్మాయిగా వేషం వేసుకుని తనను అవమానించిన స్నేహితుల ద్వారా డబ్బు సంపాదించి చదువుకుని కలెక్టర్ ఎలా అయ్యాడు అన్నదే ఈ సినిమా కథ.

ప్ర) మీ డైరెక్టర్ గురించి చెప్పండి ?

జ) డైరెక్టర్ సూర్య నారాయణ నాకు స్నేహితుడే. కలిసే చదువుకున్నాం. సినిమా అంటే అతనికి చాలా ఇష్టం. మేము కేవలం డబ్బు మాత్రమే పెట్టాం. కనీసం షూటింగ్ స్పాట్ కు కూడా సరిగా వెళ్ళలేదు. 24 క్రాఫ్ట్స్ తానే దగ్గరుండి చూసుకున్నాడు.

ప్ర) ఇక మీ హీరో హీరోయిన్ల గురించి చెప్పండి ?

జ) ఈ సినిమాలో హీరోగా చేసిన హనీష్ కూచిపూడి డ్యాన్సర్. ఇప్పటి వరకూ 800 లకు పైగానే షోస్ చేసున్నాడు. ఈ పాత్ర కోసం 60 మందిని చూశాక చివరికి హనీష్ ను సెలెక్ట్ చేసుకున్నాం. ఇక హీరోయిన్ చిరా శ్రీ ఇప్పటికే సుదీప్, ఉపేంద్ర వంటి పెద్ద పెద్ద హీరోలతో కలిసి నటించింది.

ప్ర) సినిమా అవుట్ ఫుట్ ఎలా వచ్చింది ?

జ) సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ కాపీ చూశాకా నమ్మకమొచ్చింది. సెన్సార్ బోర్డు సభ్యులు కూడా సినిమా చూసి చాలా బాగా వచ్చిందని కాంప్లిమెంట్ ఇచ్చారు.

ప్ర ) మరి సినిమా బిజినెస్ ఎలా జరిగింది ? ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ?

జ) ఇప్పటికే 60 % బిజినెస్ పూర్తయింది. మిగిలిన 40% కూడా త్వరలోనే అయిపోతుంది. ఇక సినిమాని నవంబర్ 2 వీక్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం.

ప్ర) ఫ్యూచర్ లో పెద్ద హీరోలతో, పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేస్తారా ?

జ) ఇప్పుడే పెద్ద హీరోలతో సినిమాలు చేయాలనుకోవడం లేదు. ముందు మీడియం లెవల్ హీరోలతో చేస్తాం. ఇక నెక్స్ట్ సినిమాకి కూడా సూర్యనారాయణ డైరెక్షన్ లోనే ప్లాన్ చేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు