వి విషయంలో దిల్ రాజు వెనకడుగు అందుకే..!

వి విషయంలో దిల్ రాజు వెనకడుగు అందుకే..!

Published on May 26, 2020 9:44 AM IST

నాని హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ వి విడుదలకు సిద్ధంగా ఉంది. ఉగాది కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది. ఐతే ఇప్పటికే ఈ మూవీ విడుదల చాలా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లో విడుదల చేసే ఆస్కారం కలదని వార్తలు వస్తున్నాయి. ఐతే ఈ విషయంలో దిల్ సుముఖంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల చేత ఓ టి టి విడుదల విషయంలో వెనకడుగు వేస్తున్నాడట.

దిల్ రాజు నిర్మాత కాక ముందు ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. అలాగే ఇప్పటికి కూడా నైజాంలో చాలా థియేటర్స్ ఆయన అధీనంలో ఉండగా పెద్ద సినిమాల డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటున్నారు. ఈ తరుణంలో థియేటర్స్ మనుగడకు ఇబ్బందిగా మారిన ఓ టి టి ని ప్రోత్సహించే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని ఆయన భావిస్తున్నారట. మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ చిత్రంలో నాని సీరియల్ కిల్లర్ రోల్ చేస్తుండగా, సుధీర్ పోలీస్ పాత్ర చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు