ఇంటర్వ్యూ : సమంత – ఈ ఏడాది ఇప్పటివరకూ చూడని సమంతని చూస్తారు.

ఇంటర్వ్యూ : సమంత – ఈ ఏడాది ఇప్పటివరకూ చూడని సమంతని చూస్తారు.

Published on Apr 13, 2015 2:00 PM IST

Samantha-
కెరీర్ ప్రారంభంలోనే వరుస హిట్స్ తో ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ అనిపించుకోవడమే కాకుండా, కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన తమిళ పొన్ను సమంత. సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘S/O సత్యమూర్తి’. ఈ సినిమా గత వారం రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంటోంది. సినిమా సక్సెస్ అవుతుండడంతో హ్యాపీగా ఉన్న సమంత తన ఆనందాన్ని మీడియాతో పంచుకుంది. సమంత చెప్పిన విశేషాలు మీ కోసం…

ప్రశ్న) ‘S/O సత్యమూర్తి’ సినిమాకి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తోంది.?

స) అత్తారింటికి దారేది తర్వాత త్రివిక్రమ్ తో ఛాన్స్ రావడం చాలా హ్యాపీ.. తనతో వర్కింగ్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇక సినిమా విషయానికి వస్తే సినిమా అందరికీ నచ్చుతోంది, ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. చెప్పాలంటే మొదటి రోజు బాగా మిక్స్డ్ టాక్ వచ్చింది, అలాగే రివ్యూస్ కూడా యావరేజ్ అని వచ్చాయి. దాంతో చాలా భయపడ్డాను. కానీ సెకండ్ డే నుంచి సినిమాకి వస్తున్న రెస్పాన్స్, కలెక్షన్స్ చూసి చాలా రిలాక్స్ అయ్యాను. ఈ సినిమాని ఇంట పెద్ద హిట్ చేస్తున్న ప్రేక్షకులకి నా స్పెషల్ థాంక్స్.

ప్రశ్న) ఒక డయాబెటిక్ ఉన్న అమ్మాయి పాత్ర చేయడం ఎలా అనిపించింది.?

స) అవును ఇందులో డయాబెటిక్ ఉన్న పాత్ర చేసాను. అందరూ ఇదే అడుగుతున్నారు. నా పరంగా అందులో తప్పేమీ లేదు కదా.. ప్రతి ఒక్క అమ్మాయిలో సమస్య ఉండచ్చు. కానీ వాళ్ళు బయటకి మామూలుగానే కనిపిస్తారు. ఈ రోల్ చెయ్యడంలో నాకేమీ ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే థియేటర్స్ లో నా పాత్ర అందరినీ నవ్విస్తోంది.

ప్రశ్న) మొదటి సారి అల్లు అర్జున్ తో కలిసి నటించడం ఎలా అనిపించింది.?

స) అల్లు అర్జున్ మోస్ట్ స్టైలిష్ కో స్టార్… సినిమా మొదలైన రోజు నుంచి నా స్టైలిస్ట్ కి చుక్కలు చూపించాను. బన్ని పక్కన బాగా కనపడాలి, స్టైల్స్ లో తనకి ఈక్వల్ గా ఉండాలి, ఎక్కడా ఎక్కువ ఏజ్ కనిపించకూడదు అని చాలా జాగ్రత్తలు తీసుకొని తన స్టైల్స్ తో పోటీ పడ్డాను. ఇకపోతే బన్ని ఎంతో క్రమశిక్షణ ఉన్న యాక్టర్. ప్రతి షాట్ లోనూ ది బెస్ట్ ఇవ్వాలనుకుంటాడు. తనని చూస్తే నాలో డెడికేషన్, ప్రొఫెషనలిజం తక్కువ ఉందేమో అనే వన కలిగింది. అంతలా హార్డ్ వర్క్ చేసారు. అలాగే బన్ని వెరీ గివింగ్ యాక్టర్.

ప్రశ్న) సమంత తన స్టాఫ్ ని చూసుకునే విధానం నుంచి చాలా నేర్చుకున్నా అని బన్ని అన్నారు, మరి మీరు బన్ని నుంచి ఏమి నేర్చుకున్నారు.?

స) నేను మాములుగా డైలాగ్స్ ఉంటేనే ఆ షాట్ పైన ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటాను, అదే డైలాగ్స్ లేవు అంటే కాస్త రిలాక్స్ అవుతాను. కానీ బన్ని అలా కాదు. ఎలాంటి సీన్ అయినా ప్రతి షాట్ కి చాలా ప్రాముఖ్యత ఇచ్చి కేర్ తీసుకుంటాడు. నేను కూడా తనలా ప్రతి షాట్ కి ప్రాముఖ్యత ఇవ్వడం తననుండి నేర్చుకున్నాను.

ప్రశ్న) రెండవసారి త్రివిక్రమ్ తో చేయడం ఎలా ఉంది.? తనతో మీకున్న అనుబంధం గురించి చెప్పండి.?

స) త్రివిక్రమ్ గారితో పని చేయడం, మాట్లాడడం చాలా ఈజీగా అనిపిస్తుంది. చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. తనతో పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది. అందుకే తనతో సినిమాలు చేస్తూనే ఉండమన్నా ఉంటాను. ఇక అనుబధం అంటే నాకు తనొక బెస్ట్ ఫ్రెండ్.. ఎంతో జడ్జ్ మెంట్ ఉన్న వ్యక్తి. చాలా విషయాల్లో నేను తన గైడెన్స్ తీసుకుంటూ ఉంటాను. రియల్ గా తను నాకు గురువు లాంటి వాడు.

ప్రశ్న) మీ కో స్టార్స్ నిత్యా మీనన్, ఆద శర్మల గురించి చెప్పండి.? అలాగే ఒకేసారి ఇద్దరు, ముగ్గురు హీరోయిన్స్ తో స్క్రీన్ పంచుకోవడం ఇబ్బంది ఉండదా.?

స) నా కో స్టార్స్ తో నాకు ఎప్పుడు మంచి రిలేషన్ ఉంటుంది. సౌత్ టాలెంటెడ్ యాక్టర్ నిత్యా ఈ మూవీలో చాలా బాగా చేసింది. అలాగే ఫస్ట్ డే ఆద శర్మ డెడికేషన్ చూసి చాలా షాక్ అయ్యాను. ఈ సినిమాతో తనకి మరిన్ని ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నా.. ఇక మీరన్నట్టు ఇద్దరు ముగ్గురుతో స్క్రీన్ పంచుకోవడం కాస్త కష్టమే కానీ ప్రేక్షకులు అదే కోరుకుంటున్నారు కదా…

ప్రశ్న) మనం తర్వాత నటనకి ఆస్కారం ఉన్న పాత్రలు చేయలేదు. ఈ ఏడాది కూడా గ్లామరస్ పాత్రల్లోనే కనిపిస్తారా.?

స) నిజమే.. గత ఏడాది నటనకి ఆస్కారం ఉన్న సినిమాలు కాకుండా గ్లామరస్ రోల్స్ చేసాను.. ఆ సినిమాలు నిరాశపరిచాయి కూడా.. అందుకే ఈ సంవత్సరం వచ్చే సినిమాలన్నీ సమంత గురించి ఎక్కువ మాట్లాడుకునేలా, ఎక్కువ రాసేలా ఉంటాయి. ముఖ్యంగా నా కెరీర్లో ఇలాంటి ఓ పాత్ర చేస్తానా.? అసలు చెయ్యగలనా.? అని ఫీలయ్యే ఓ పాత్రని విక్రమ్ – మిల్టన్ సినిమాలో చేస్తున్నాను. ఎంతో స్ట్రాంగ్ గా అనిపించే పాత్ర, నా కెరీర్లోనే అత్యంత కష్టమైన పాత్ర అది. ఆ సినిమా అందరినీ షాక్ చేస్తుంది. ఈ ఏడాది వచ్చే మిగతా సినిమాలు కూడా అలానే ఉంటాయని మాత్రం చెప్పగలను.

ప్రశ్న) సక్సెస్ మరియు ఫెయిల్యూర్స్ ని ఎలా తీసుకుంటారు.?

స) ప్రతి సినిమా సైన్ చేస్తాప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందనే ఒప్పుకుంటాం, కానీ కొన్ని ఫెయిల్ అవుతుంటాయి. అప్పుడు బాధ వేస్తుంది. కానీ అదే బాధలో ఉండలేం కదా అందుకే ముందుకు వెళ్ళిపోతుంటా.. కానీ సక్సెస్ మాత్రం చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది.

ప్రశ్న) బిజినెస్ మెన్ తో ప్రేమలో ఉన్నారని, అలాగే ప్రొడక్షన్ లో కూడా అడుగుపెడుతున్నారని వార్తలొస్తున్నాయి.. అందులో నిజం ఎంత.?

స) (బాగా నవ్వి)బిజినెస్ మాన్ ఆ ఎవరండి అతను.. పేరు, నెంబర్ ఉంటే ఇవ్వండి.. నేను ఓ సారి మాట్లాడతాను(నవ్వులు). అలాంటిది ఏమీ లేదండి.. ప్రస్తుతం యాక్టర్స్ అయితే అస్సలు వద్దు కానీ మీరు బిజినెస్ మాన్ అంటున్నారు కదా అందుకే ఓ సారి ట్రై చేద్దాం.. నెంబర్ ఉంటే ఇవ్వండి.. ప్రొడక్షన్ లోకి వెళ్ళే ఉద్దేశమే లేదు. అది కూడా తప్పు వార్తే..

ప్రశ్న) ఇండస్ట్రీకి వచ్చి 5 సంవత్సరాలైంది. ఎలా ఉంది ఈ జర్నీ.?

స) ఈ 5 ఏళ్ళ జర్నీ చాలా బాగుంది. ఈ 5 సంవత్సరాల్లో నాకంటూ ఒక ఇమేజ్ వచ్చింది. అందుకే ఇక నుంచి జస్ట్ పాటల్లో వచ్చి వెళ్ళిపోయే పాత్రలు కాకుండా ఎక్కువగా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలనే సెలక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను.

ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.?

స) సినిమా సెట్లో అడుగు పెట్టే వరకూ నేను కొత్త సినిమాల గురించి చెప్పను. ఓ స్టార్ హీరోతో, ఓ మంచి పాత్ర ఓకే చేసాను. దాని గురించి త్వరలోనే చెప్తాను. కానీ ఈ సంవత్సరం సమంతని చాలా డిఫరెంట్ సినిమాల్లో చూస్తారు అది మాత్రం గ్యారంటీ..

అంతటితో సమంత ఫ్యూచర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని అల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాం..

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు