ఇద్దరు నాయికల నడుమ సునీల్

ఇద్దరు నాయికల నడుమ సునీల్

Published on Apr 2, 2015 2:43 AM IST

sunil
వాసు వర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో సునీల్ హీరోగా ఒక ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం మేము ముందుగానే తెలిపాం. ఈ సినిమా ఇప్పుడు మొదటి షెడ్యూల్ స్విట్జర్ల్యాండ్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సునీల్ కెరీర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా విజయంపై నిర్మాత నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇద్దరి హీరోయిన్లకు స్థానముందట. కన్నడ, తమిళ సినిమాలలో నటించిన నిక్కి గాల్రాని తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇటీవలే తుంగభద్ర సినిమాలో కనిపించిన డింపుల్ చోప్డే మరో హీరోయిన్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు