‘నాన్నకు ప్రేమతో’ ఆడియోకు భారీ క్రేజ్!

‘నాన్నకు ప్రేమతో’ ఆడియోకు భారీ క్రేజ్!

Published on Dec 26, 2015 1:58 PM IST

nannaku-prematho
యంగ్ టైగర్ ఎన్టీఆర్, విలక్షణ దర్శకుడు సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ‘నాన్నకు ప్రేమతో’ అనే సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ సంక్రాంతి సీజన్‌కు వస్తోన్న క్రేజీ సినిమాల్లో భారీ అంచనాల మధ్య, ముందు నుంచే పాజిటివ్ వైబ్రేషన్స్ నింపుకొన్న ‘నాన్నకు ప్రేమతో’ జనవరి 13న అనుకున్న తేదీకి ప్రేక్షకుల ముందు వాలిపోయేలా ప్రొడక్షన్‌ను వేగవంతం చేసేసింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్‌తో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ కోసం కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గత కొద్దికాలం వరకూ ఆడియో రిలీజ్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎదురుచూసిన అభిమానులకు డిసెంబర్ 27న ఆడియోను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి వాళ్ళలో ఉత్సాహాన్ని నింపారు. భారీ ఎత్తున జరిగే ఓ ఈవెంట్ ద్వారా నాన్నకు ప్రేమతో ఆడియోను విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్ సినిమాగా నిలుస్తుందంటూ ప్రచారం పొందుతూ వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా ఆడియో కోస అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ – సుకుమార్‌ల హిట్ కాంబినేషన్‌ కూడా ఈ స్థాయి క్రేజ్‌కు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించారు.

తాజా వార్తలు