కొత్త వాళ్ళతో పనిచేయడమే ఇష్టమంటున్న సెన్సేషనల్ హీరో !

కొత్త వాళ్ళతో పనిచేయడమే ఇష్టమంటున్న సెన్సేషనల్ హీరో !

Published on Dec 2, 2016 11:51 AM IST

vijay-antony
తెలుగు హీరోలకి తెలుగు పరిశ్రమలో క్రేజ్ ఉండటం పెద్ద విశేషమేమీ కాదు. కానీ తమిళ హీరోలకి తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉండటం మాత్రం ఖచ్చితంగా విశేషమని చెప్పాలి. అలాంటి విశేషమైన హీరోల్లో విజయ్ ఆంటోనీ కూడా ఒకరు. ఈ మధ్య కాలంలో ఏ తమిళ హీరోకి తెలుగు రానంత క్రేజ్ ఇతనికొచ్చింది. అందుకు కారణం ‘బిచ్చగాడు’ చిత్రమే. డబ్బింగ్ సినిమాగా వచ్చిన ఈ బిచ్చగాడు సుమారు రూ.20 కోట్లు వసూలు చేసింది. ఆ క్రేజ్ ను బలంగా చేసుకుని ఆంటోనీ తాజా చిత్రం ‘భేతాళుడు’ మంచి ఓపెనింగ్స్ సాధించి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది.

తమిళంలో వర్షన్ ‘సైతాన్’ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్బంగా మీడియాతోమాట్లాడిన విజయ్ ఆంటోనీ ‘నా సినిమాలకు కొంచెం హార్డ్ గా ఉండే టైటిల్స్ పెట్టడమే నాకిష్టం. అలా ఉంటేనే అవి జనాలకు గుర్తుంటాయి. ఇలాంటి టైటిల్స్ పెడితే సినిమాలకు నష్టమనేది పాత నమ్మకం. అలాగే నాకు కొత్త దర్శకులతో పని చేయడమే ఇష్టం. ఎందుకంటే వాళ్ళే కొత్తగా ఆలోచించగలుతారు. ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు. వచ్చిన అవకాశాన్ని కష్టపడి సరిగ్గా వాడుకుంటారు. అందుకే ఎక్కువగా వాళ్ళతోనే పని చేస్తాను’ అని తెలిపాడు విజయ్ ఆంటోనీ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు