‘విశ్వరూపం-2’ ను శరవేగంగా పూర్తి చేస్తున్న కమల్ !


విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘విశ్వరూపం-2’ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే ఆగిపోయిన ఈ ప్రాజెక్టును పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్న కమల్ పశరవేగంగా సినిమాను పూర్తి చేస్తున్నారు. ఇంతకూ ముందే షూటింగ్ దాదాపుగా పూర్తికాగా మిగిలిన కాస్త చిత్రీకరణను పూర్తి చేసి ప్రస్తుతం పాటలు రికార్డింగ్ చేస్తున్నారు.

ఆడియోలో చివరి పాటను హిందీ, తమిళ వెర్షన్లలో ఇప్పటికే రికార్డ్ చేసేశారు. హిందీ భాషలో పర్సును జోషి లిరిక్స్ అందించగా తమిళంలో స్వయంగా కమల్ హాసనే లిరిక్స్ రాయడం విశేషం. ఇక తెలుగు వెర్షన్ పాటను కూడా త్వరలోనే రికార్డ్ చేయనున్నారు. ఈ సిరీస్ లో వచ్చిన మొదటి పార్ట్ మంచి విజయం సాధించడంతో ఈ రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

 

Like us on Facebook