కోనా వెంకట్ కు పీడకలగా మారిన బర్త్ డే పార్టీ

కోనా వెంకట్ కు పీడకలగా మారిన బర్త్ డే పార్టీ

Published on Mar 28, 2015 4:26 PM IST

Kona-Venkat3
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు వేడుకలు ఇద్దరు సెలెబ్రిటీల కొంపలు ముంచాయి. రచయిత మరియు నిర్మాతగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న కోన వెంకట్ మరియు ప్రొడ్యూసర్ దానయ్య లకు ఈ బర్త్ డే పార్టీ ఒక పీడ కలగా నిలిచింది. పార్టీ నుండి తిరిగి వెళ్తుంటే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వీరిపై దాడి చేసి దొంగతనానికి పాల్పడ్డారు.

కోనా వెంకట్ ట్విట్టర్ లో తెలిపిన కధనం ప్రకారం కార్ లో తిరిగి ప్రయాణిస్తుండగా కొందరు దుండగులు వీరిని ముట్టడించి, కత్తులతో బెదిరించి వారిని దోచుకెళ్ళారట. ఈ సంఘటనపై కేస్ ఫైల్ చేసినట్టు, పోలీసులు దర్యాప్తి జరుపుతున్నట్టు తెలిసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు