‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్ పాత్ర పోషించనున్న యంగ్ స్టార్ హీరో !

‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్ పాత్ర పోషించనున్న యంగ్ స్టార్ హీరో !

Published on Apr 23, 2017 6:59 PM IST


యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రస్తుతం ‘మహానటి’ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. మే 10 నుండి ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ హైదరాబాద్లో మొదలుకానుంది. అలనాటి మహానటి సావిత్రి యాదార్థ జీవిత గాధ ఆధారంగా రూపొందుతున్న సినిమా కావడంతో అప్పటి పలువురు పాపులర్ నటులు కూడా ఇందులో కనిపించనున్నారు. దీంతో ఈ పాత్రల స్వభావాన్ని అశ్విన్ ఎలా చూపిస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

ముఖ్యంగా సావిత్రి భర్త జెమినీ గణేశన్ క్యారెక్టర్ ఏ హీరో చేస్తాడు అనే దానిపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలోనే ఒక యంగ్ స్టార్ హీరో ఆ క్యారెక్టర్ చేస్తున్నట్టు తెలిసింది. అతను మరెవరో కాదు మలయాళ పరిశ్రమకు చెందిన దుల్కర్ సల్మాన్. నటుడిగా ఆనతి కాలంలోనే గొప్ప పేరు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ ఈ పాత్ర చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ మరింతగా పెరిగనుంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సావిత్రి రోల్ కీర్తి సురేష్ చేస్తుండగా, సమంత మరొక కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి ఇతర ముఖ్య పాత్రల కోసం ఇంకా నటుల్ని ఫైనల్ చేయాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు