ఇస్లాం మతం తీసుకున్నయువన్ శంకర్ రాజా

ఇస్లాం మతం తీసుకున్నయువన్ శంకర్ రాజా

Published on Oct 30, 2014 3:36 AM IST

Yuvan-Shankar-Raja
ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా కొన్ని రోజుల క్రితం ఇస్లాం మతం తీసుకున్నారు. తన పేరుని అబ్దుల్ హలిక్ గా మార్చుకున్నారు. అయితే మారిన పేరు ఎప్పట్నుంచి చిత్రాలలో కనపడుతుందో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కొంతమంది మాత్రం మారిన పేరు సూర్య ”మాస్” చిత్రం లో కనపడుతుందని అంటున్నారు.

ఈ మత మార్పిడి యువన్ ఫాన్స్ కి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే గతంలో కూడా ఎంతోమంది ప్రముఖులు మతం మార్చుకున్నారు. లెజండరీ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఇస్లాం మతం తీసుకోక ముందు ఆయన అసలు పేరు దిలీప్ కుమార్. యువన్ తాజా చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’ పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు