సమీక్ష : ధోని – 17 x 8 చుట్టూ తిరిగే పవర్ఫుల్ మెలోడ్రామ

సమీక్ష : ధోని – 17 x 8 చుట్టూ తిరిగే పవర్ఫుల్ మెలోడ్రామ

Published on Feb 9, 2012 7:55 PM IST
విడుదల తేది : 10 ఫిబ్రవరి 2012
123తెలుగు.కాం రేటింగ్: 3.5/5
దర్శకుడు : ప్రకాష్ రాజ్
నిర్మాత :ప్రకాష్ రాజ్
సంగిత డైరెక్టర్ : ఇళయరాజా
తారాగణం : మాస్టర్ ఆకాష్ ,ప్రకాష్ రాజ్

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ దర్శకుడిగా మారి తీసిన చిత్రం ‘ధోని’. ఆకాష్ కీలక పాత్రలో నటించగా ప్రకాష్ రాజ్, రాధిక ఆప్టే, శరత్ బాబు, నాజర్, గొల్లపూడి మారుతీరావు మరియు ఇతర నటీనటులు నటించారు. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ తీసిన చిత్రం. మరాఠీలో మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో వచ్చిన ‘శిక్షనచ్య అయిచ గో’ చిత్ర ప్రేరణతో ధోని చిత్రాన్ని తీసారు. ఈ రోజు ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శన వేయడం జరిగింది. ధోని చిత్రం ఎలా ఉందొ చూద్దాం.

కథ:

సుబ్రహ్మణ్యం (ప్రకాష్ రాజ్) మధ్య తరగతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. సుబ్రహ్మణ్యం భార్య చనిపోవడంతో ఆయన ఇద్దరి పిల్లల్ని ఆయనే పెంచుతుంటాడు. ఆ ఇద్దరు పిల్లలికి మంచి చదువు చెప్పించేందుకు కొన్ని త్యాగాలు కూడా చేస్తాడు. కాని అతని కొడుకు కార్తీక్ (ఆకాష్) కి మాత్రం చదువు అంటే ఆసక్తి ఉండదు. అతను క్రికెట్ అంటే బాగా ఆసక్తి. కార్తీక్ కి పరీక్షల్లో సరిగా మార్కులు రాకపోవడంతో సుబ్రమణ్యం బాధపడుతూ ఉంటాడు. సుబ్రహ్మణ్యం పొరుగింటిలో ఉండే నళిని (రాధిక ఆప్టే) కి సుబ్రహ్మణ్యం పిల్లలంటే ఇష్టం. కార్తీక్ కి చదువుల్లో రాణించలేకపోవడంతో అతని స్కూల్ యాజమాన్యం సుబ్రహ్మణ్యం పై ఒత్తిడి తెస్తుంది. అదే సమయంలో సుబ్రహ్మణ్యం విపరీత నిర్ణయాలు తీసుకుంటాడు. స్కూల్ యాజమాన్యం మరియు సుబ్రహ్మణ్యం ఒత్తిడి పెరిగిన సమయంలో కార్తీక్ 17 x 8 ఎంత అంటూ ఒక సులభమైన ప్రశ్న అడుగుతాడు. ఎవరికీ తోచిన రీతిలో వారు సమాధానం చెబుతారు. అప్పుడు సుబ్రహ్మణ్యం తన కొడుకును కాపాడుకునేందుకు వ్యవస్థపై పోరాటం మొదలు పెడతాడు. అదే సమయంలో నళినిలో ఉన్న చీకటి కోణాన్ని గుర్తిస్తాడు. ఏంటది? సుబ్రహ్మణ్యం తన పోరాటంపై చివరి వరకూ నిలబడ్డాడా ?

ప్లస్ పాయింట్స్:

మంచి అర్ధవంతమైన సినిమా తీసినందుకు ప్రకాష్ రాజ్ ను అభినందించాలి. నటుడిగానే కాకుండా దర్శకుడిగా తనని తను నిరూపించుకున్నాడు. ధోని మీ హృదయాన్ని తాకుతుంది. చిత్ర మొదటి భాగం మంచి కథతో వెళ్తూ ఇంటర్వల్ వరకు బాగా తీసాడు. కార్తీక్ పాత్రలో ఆకాష్ చాలా బాగా నటించాడు. అతని పరిణతి కూడిన నటన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. రాధిక ఆప్టే చాలా మంచి నటి. ఆమె ఈ సినిమాలో కూడ బాగా నటించింది. కాటన్ చీరల్లో సింపుల్ గా బావుంది.

గొల్లపూడి మారుతీరావు, శరత్ బాబు, తనికెళ్ళ భరణి మరియు మురళి శర్మ బాగా నటించారు. బ్రహ్మానందం చిత్ర మొదటి మొదటి భాగంలో బాగానే నవ్వించాడు. ప్రభుదేవా ఒక పాటలో తళుక్కున మెరిసాడు. సెంటిమెంట్ సన్నివేశాలు చాలా బాగా తీసారు. చాలా మధ్య తరగతి కుటుంబాలు బాగా కనెక్ట్ అవుతాయి. ప్రకాష్ రాజ్ టీవీ స్టుడియోలో మాట్లాడే సన్నివేశాలు, మరియు ముఖ్యమంత్రిని 17 x 8 ఎంత అని అడిగే సన్నివేశాలు చాలా బాగా చిత్రీకరించారు.

మైనస్ పాయింట్స్:

చిత్ర రెండవ భాగం అనుకున్న స్థాయిలో తీయలేకపోయాడు. కొన్ని అంశాలు వదిలేసి ఉంటే బావుండేది. సమస్యకు సంభందించి ఒక వైపు మాత్రమే వాదన జరగడం రెండు వైపు వదిలేయడం జరిగింది. ప్రకాష్ రాజ్ రాధిక ఆప్టే మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకునే సన్నివేశాలు మార్చుకునే సన్నివేశాలు బాగా తీసి ఉంటే ఇంకా బావుండేది.

సాంకేతిక విభాగం:

ప్రతి ఒక్కరు ఇళయరాజా గారి సంగీతం గురించి ఎంతో ఆశించి వస్తారు. ఇళయరాజా గారి సంగీతం పర్వాలేదు. బ్యాక్ మ్యూజిక్ మాత్రం బావుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ప్రకాష్ రాజ్ స్క్రీన్ప్లే చిత్ర మొదటి భాగంలో చాలా బావుంది కాని రెండవ భాగంలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. డైలాగ్స్ బావున్నాయి.

తీర్పు:

ధోని మీ గుండెని తాకే పవర్ఫుల్ మెలోడ్రామా. చిత్ర రెండవ భాగంలో కొన్ని అనవసరమైన అంశాలు ఉన్నప్పటికీ వాటిని వదిలేస్తే నటీనటులు ప్రదర్శించిన అధ్బుత నటన ఆకట్టుకుంటుంది. ఏ మరియు బి సెంటర్స్ వారికీ బాగా నచ్చుతుంది. మసాల సినిమాలు చూసేవారికి పెద్దగా నచ్చకపోవచ్చు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ధోని.

123తెలుగు.కామ్ రేటింగ్: 3.5/5

అనువాదం :అశోక్ రెడ్డి. ఎమ్

Clicke Here For Dhoni English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు