సమీక్షా : ‘ ఏప్రిల్ ఫూల్ ‘ – పెద్ద టార్చర్

సమీక్షా : ‘ ఏప్రిల్ ఫూల్ ‘ – పెద్ద టార్చర్

Published on May 10, 2014 1:00 PM IST
AprilFool విడుదల తేదీ : 10 మే 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 1/5
దర్శకత్వం : కృష్ణ స్వామి శ్రీకాంత్
నిర్మాత : జిఎల్ శ్రీనివాస్
సంగీతం : బంటి
నటీనటులు : జగపతి బాబు, భూమిక, రణధీర్


‘లెజెండ్’ సినిమాలో తను చేసిన పాత్రకు మంచి పేరు రావడంతో, ఫ్యామిలి హీరో జగతిబాబు నటించి విడుదల కానీ పలు చిత్రాలను విడుదల చేయడానికి నిర్మాతలు ఉత్సాహ పడుతున్నారు. ఆ కోవకు చెందిందే శనివారం విడుదల అయిన ‘ఏప్రిల్ ఫూల్’. ఈ సినిమాలో జగతిబాబు సరసన భూమిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:

కాకి (రణధీర్) ఒక అమాయకమైన యువకుడు, ఇతన్ని ఎప్పుడు అందరూ ఫూల్ చేస్తూ ఉంటారు. ఒక రోజు తనకు ఒక కల వస్తుంది, ఈ కలలో తను మరుసటి రోజు ఎం జరుగుతుందో అనేది తెలుసుకుంటాడు. ఇది కల అని అతను తెలుసుకున్న తరువాత, జగపతి బాబు భూమికల జంటకి ఈ కలతో సంబంధం ఉందని తెలుస్తుంది.

ఈ జంట కాకి కల ఎందుకు ఉంటారు? ఈ ముగ్గురికి ఒకరితో ఒకరికి ఎం సంబంధం ఉంటుంది? ఆ తరువాత ఏమవుతుంది అనేదే ఈ సినిమా కథాంశం.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో చెప్పుకోడానికి ఎలాంటి ప్లస్ పాయింట్స్ లేవు. తమ అనుభవానికి తగట్టు జగపతి బాబు మరియు భూమికలు ఈ అర్ధంలేని సినిమాను గట్టేకించే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్ :

‘ఏప్రిల్ ఫూల్’ సినిమా టైటిల్ తగినట్టే సినిమాకి వెళ్ళిన ప్రేక్షకుడిని పూర్తిగా ఫూల్ చేస్తుంది. సినిమాలో ఒక సన్నివేశం కూడా అర్ధం అవదు. సినిమా టైటిల్ కార్డ్ నుండి ఇంటర్వెల్ వరకు అసలు ఎం జరుగుతుందో కూడా ఎవరికీ అర్ధం అవదు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ‘హ్యాపీ డేస్’ ఫేం రణధీర్ తన ఓవర్ యాక్షన్ తో ప్రేక్షకుడికి చిరాకు తెప్పిస్తాడు. తన సన్నివేశాలు అన్ని చాలా దారుణంగా ఉంటాయి, ధియేటర్ నుండి ఎప్పుడు వెళ్ళి పోదామా అనట్టు ఉంటుంది.

జగపతి బాబు, భూమిక వంటి మంచి పేరున్న నటులు ఈ సినిమా చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారో అందరికి ఆశ్చర్యంగా ఉంది. వారి ఇద్దరి క్యారెక్టర్స్ సినిమాలో ఎందుకు ఉన్నాయో కూడా అర్ధం కాకుండా ఉంటుంది. ఈ ఉన్న క్యారెక్టర్స్ తోనే సినిమాకు వచ్చిన ప్రేక్షకుడు పిచ్చేక్కిపోతుంటే, మళ్ళి సినిమాకి ఒక విలన్ క్యారెక్టర్.

సాంకేతిక విభాగం :

సినిమాలో సంగీతం చాలా చెత్తగా ఉందనే చెప్పుకోవాలి. సినిమాలో మంచి విషయం ఏంటి అంటే ఎక్కువ పాటలు లేకపోవడం. సినిమా స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక సన్నివేశం కూడా అర్ధం కాకుండా ఉంటుంది, ఒక సీన్ కి ఇంకో సీన్ కి అసలు సంబంధమే ఉండదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో డ్రామాలా ఉంటుంది. సినిమాలో డైలాగులు కూడా సినిమా తరహలోనే అర్ధం కాకుండా ఉంటాయి.

దర్శకుడు ఈ కథను ఎందుకు రాసుకున్నాడో తెలీదు, రాసిన కథను సరిగ్గా అమలు చేశాడా అంటే ఆది లేదు. ఒక చిన్న స్టొరీ లైన్ ని ఏదో చేద్దాం అనుకుని బొక్కబోర్ల పడ్డాడు.

తీర్పు :

‘ఏప్రిల్ ఫుల్’ పేరుకు తగట్టే సినిమాకు వెళ్ళిన ప్రేక్షకుడిని ఫూల్ చేస్తుంది. మీరు ఎవర్ని అయిన ద్వేషిస్తున్నారా, అయితే వారికీ ఈ సినిమా చూపివండి. ఈ సినిమాని టివిలో చూసి కూడా ఫూల్ అవకండి.

123తెలుగు. కామ్ రేటింగ్ : 1/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు