వైరల్.. విజయ్ కి గాయాలు?

వైరల్.. విజయ్ కి గాయాలు?

Published on Apr 25, 2024 7:07 AM IST


సౌత్ ఇండియా స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” (The Greatest Of All Time) కోసం తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం విజయ్ చాలా కాలం తర్వాత ఒక సరికొత్త మేకోవర్ ని చేసి శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. అయితే తాజాగా విజయ్ సంబంధించి కొన్ని ఫోటోలు వచ్చాయి.

హరిహర వీరమల్లు (Hari Hara Veermalllu) నిర్మాత ఏ ఎం రత్నంని విజయ్ తన “గిల్లీ” (Ghilli Re Release) రీ రిలీజ్ సక్సెస్ సందర్భంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసాడు. అయితే ఈ ఫోటోలలో సరిగా చూస్తే విజయ్ చేతికి పెద్ద గాయమే కనిపిస్తుంది. దీనితో సినిమా షూటింగ్ లో కూడా విజయ్ కి గట్టి దెబ్బే తగిలినట్టుగా ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. దీనితో సినిమా పట్ల విజయ్ ఎంత డెడికేటెడ్ గా ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు