సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ల కూలీ టైటిల్ టీజర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంది. ఈ టైటిల్ టీజర్ కి లెజెండరీ కంపోజర్ ఇళయరాజా సంగీతం ఉండటం తో వార్తల్లో నిలిచింది. మాస్ట్రో స్వరపరిచిన తంగమగన్‌లోని వా వా పక్కం వా పాటను అనిరుధ్ ఈ టీజర్ లో ఉపయోగించారు. ఇది ఇళయరాజాకు ఏ మాత్రం నచ్చలేదు. తన అనుమతి లేకుండా తన సంగీతాన్ని ఉపయోగించినందుకు కూలీ బృందానికి కాపీరైట్ నోటీసు పంపాడు.
ఈ రోజు చెన్నై విమానాశ్రయంలో రజినీకాంత్ కనిపించారు. కొంతమంది విలేకరులు ఇళయరాజా కాపీరైట్ ఇష్యూ గురించి మాట్లాడమని అడిగారు. ఇళయరాజా, నిర్మాత కళానిధి మారన్ మధ్య సమస్య ఉంది అని రజనీకాంత్ అన్నారు. ఇరువర్గాలు సామరస్యపూర్వకమైన పరిష్కారానికి వస్తాయో లేదో చూడాలి. ఈ చిత్రంలో మాఫియా డాన్‌గా కనిపించనున్నారు రజినీకాంత్. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.