కల్కి, వెట్టైయాన్ చిత్రాల పై రానా దగ్గుపాటి కామెంట్స్!

కల్కి, వెట్టైయాన్ చిత్రాల పై రానా దగ్గుపాటి కామెంట్స్!

Published on May 4, 2024 11:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి (Kalki2898AD). వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా టాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన రానా దగ్గుపాటి ఈ చిత్రం పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నెక్స్ట్ బిగ్ మ్యుమెంట్ కల్కి, కేవలం భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచం లోని అందరూ ఈ చిత్రం కి కనెక్ట్ అవుతారు అంటూ చెప్పుకొచ్చారు రానా. కల్కి సైడ్ నుండి తనకి ఎవెంజర్స్ మూమెంట్ ఉంది అని అన్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో, డైరక్టర్ టీ.జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెట్టైయాన్ లో రానా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఇది సాధారణ రజినీకాంత్ సినిమా కాదు, న్యాయవ్యవస్థ, పోలీసు, వ్యవస్థాపక వ్యవస్థలతో కూడిన డ్రామా అని తెలిపారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు