జపాన్లో ప్రభాస్, రామ్ చరణ్ ల హవా

జపాన్లో ప్రభాస్, రామ్ చరణ్ ల హవా

Published on May 4, 2024 8:08 PM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి దాదాపు అందరి స్టార్ హీరోస్ లో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో సహా ఇతర దేశాల్లో కూడా మంచి క్రేజ్ ఉన్న వారు ఉన్నారు. మరి అలాంటి హీరోస్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. మరి ఈ ఇద్దరికీ కూడా మన దేశంలోనే కాకుండా జపాన్ లో కూడా భారీ క్రేజ్ ఉంది.

బాహుబలి (Bahubali) సినిమాలతో ప్రభాస్ కి మగధీర ఇతర సినిమాలతో చరణ్ కి అక్కడ మంచి క్రేజ్ వచ్చింది. అలా అక్కడ రిలీజ్ అయ్యిన ఇండియన్ సినిమాల్లో అయితే మొదటి రోజు హైయెస్ట్ ఫుట్ ఫాల్స్ ఉన్న హీరోస్ గా ఈ ఇద్దరు టాప్ లో నిలిచారు. మరి ప్రభాస్ బాహుబలి, సాహో (Saaho) సినిమాలతో నిలిస్తే రామ్ చరణ్ రౌద్రం రణం రుధిరం (RRR), రంగస్థలం (Rangasthalam) సినిమాలతో సత్తా చాటాడు.

దీనితో టాప్ 5 చిత్రాల్లో వీరి సినిమాలే నిలవడం విశేషం. దీనితో వీరిద్దరి క్రేజ్ మాత్రం జపాన్ ఆడియెన్స్ లో గట్టిగానే ఉందని చెప్పాలి. ఇక తాజాగా ప్రభాస్ నటించిన సెన్సేషనల్ హిట్ “సలార్” ఈ జూలై లో జపాన్ లో రిలీజ్ కాబోతుంది. దీనికి ఏ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయి అనేది కూడా ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు