నారా రోహిత్ ప్రధాన పాత్రలో, ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం లో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా ప్రతినిధి 2. ప్రతినిధి ఫ్రాంచైజీలో ప్రతినిధి 2 రెండవ చిత్రం. ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ 25న విడుదల చేయాలని మేకర్స్ భావించారు, కానీ చివరి నిమిషంలో కొన్ని అనివార్య కారణాలతో విడుదల వాయిదా పడింది. ప్రతినిధి 2 ఇప్పుడు మే 10న థియేటర్ల లోకి రానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు ఈ చిత్రం విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.
చిత్రం నుండి రిలీజైన టీజర్, ట్రైలర్‌కు మంచి ఆదరణ లభించింది. నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్‌గా నటించాడు. సిరీ లెల్లా కథానాయికగా నటించగా, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాని వానరా ఎంటర్టైన్మెంట్స్ మరియు రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రజ బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట మరియు సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.