సమీక్ష : నివాసి – ఆసక్తికరంగా సాగని నివాసి జర్నీ

సమీక్ష : నివాసి – ఆసక్తికరంగా సాగని నివాసి జర్నీ

Published on Aug 24, 2019 3:01 AM IST
Nivasi movie review

విడుదల తేదీ : ఆగస్టు 23, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.25/5

నటీనటులు : శేఖర్ వర్మ,వివియా సంత్,జయ ప్రకాష్,సుదర్శన్.

దర్శకత్వం : సతీష్ రేగల్ల

నిర్మాత‌లు : కే ఎన్ రావు.

సంగీతం : చరణ్ అర్జున్.


నూతన నటీనటులు శేఖర్ వర్మ హీరోగా వివియా సంత్ హీరోయిన్ గా సతీష్ రేగల్ల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ”నివాసి”.ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది,మరి ఈ చిత్రం ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్ష లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

సీనియర్ నటుడు(జయ ప్రకాష్) ఒక బిలినియర్ అయితే తన కొడుకు అయినటువంటి హీరో వివాన్ ఆదిత్య(శేఖర్ వర్మ) ఏ కష్టం కూడా తెలీకుండా బతుకుతాడు.దీనితో తన కొడుకుకి అసలు ప్రపంచం అంటే ఏమిటి?మనుషుల మధ్యన ఉండే ప్రతీ ఒక్క ఎమోషన్ ఎలా ఉంటుందో,తనలో తనని వెతుక్కోమని కొన్ని షరతులతో చాలా తక్కువ డబ్బులిచ్చి ఇండియాలోని కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్లమంటాడు, ఈ క్రమంలో హీరో ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు?తాను తన తండ్రి కోరుకున్న మనిషిలో మనిషిని,మూలాలను కనుగొన్నాడా లేదా అన్నది తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా హీరోతో పాటుగా కథ మొత్తం కమెడియన్ సుదర్శన్ పాత్ర ట్రావెల్ అవుతూ అవసరమైన చోటల్లా నవ్విస్తుంది.కథానుసారం వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి.హీరో లుక్స్ పరంగా రిచ్ కిడ్ గా కరెక్ట్ గా సెట్టయ్యాడు.హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే కొన్ని ప్రేమ సన్నివేశాలు మరియు ఎమోషనల్ సీన్లకు ప్రేమికులు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
ముఖ్యంగా హీరో తండ్రి పాత్రలో కనిపించిన సీనియర్ నటుడు జయ ప్రకాష్ బాధ్యత గల తండ్రి పాత్రకు జీవం పోశారు. అంతే కాకుండా ఈ సినిమాలో హీరో తన ప్రయాణంలో కలుసుకునే ప్రతీ పాత్రకు ఒక ఎమోషనల్ కంక్లూజన్ ఇచ్చేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నం ఆకట్టుకుంటుంది.హీరో తన ప్రయాణంలో కల్మషం లేని స్నేహం,నిజమైన ప్రేమ బంధుత్వాలలో ఉండే స్వార్ధం, ప్రేమలలో ఉండే వ్యత్యాసాన్ని చూపించిన విధానం బాగుంది.చివరగా హీరోయిన్ నటన అన్ని కోణాల్లో కంటే ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించింది.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో చెప్పాలంటే చాలానే మైనస్ పాయింట్స్ ఉన్నాయి.దర్శకుడు ఎంచుకున్న స్టోరీ లైన్ లో అసలు ఎలాంటి కొత్తదనము కనిపించదు.తాను ఎంచుకున్న కథ ఏమటి అన్నది టైటిల్స్ కార్డ్స్ లొనే చెప్పేస్తారు.దాన్ని పట్టుకొని ఒక రెండు గంటల సినిమాలా సాగదీసినట్టుగా అనిపిస్తుంది.ఎమోషన్స్ తాను అనుకున్న పాయింట్స్ ను చక్కగా ఎలివేట్ చేసిన దర్శకుడు అదే పాయింట్స్ ను సాగదీసి ఒక సినిమాగా మలిచేందుకు విఫలయత్నం చేసారు.
ఇక అలాగే చాలా సీన్స్ అయితే కావాలని ఇరికించినట్టుగా సంబంధం లేనట్టుగా,లాజిక్ లెస్ గా ఉంటాయి.ఈ విషయంలో దర్శకుడు కథనాన్ని ఆసక్తి కరంగా రాసుకుని ఉంటే బాగుండేది.సినిమా రెండు గంటలే అయినా ఈ రెండు గంటల్లోనే ఇంత సాగదీత అవసరమా అని చూసే ప్రేక్షకుడికి అనిపించక మానదు.ఇక హీరో అయితే లుక్స్ పరంగా ఒకే అయినా నటుడిగా మాత్రం ఇంకా పరిణితి తెచ్చుకోవాలి.

సాంకేతిక విభాగం :

దర్శకుడు సతీష్ రేగల్లా సింపుల్ స్క్రిప్ట్ ను పట్టుకొని దాన్ని ఆసక్తికరంగా మలచడంలో పూర్తిగా న్యాయం చేయలేకపోయారు.చరణ్ అర్జున్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది.ప్రధాన పాత్రదారుల మధ్య ఒక సిట్యుయేషనల్ సాంగ్ మరియు క్లైమాక్స్ లో సాంగ్ ఒకటి బాగుంటుంది.అలాగే నిర్మాత కే ఎన్ రావు అందించిన నిర్మాణ విలువలు జస్ట్ ఒకే అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీకి యాభై శాతం మార్కులు వెయ్యొచ్చు.

తీర్పు :

ఇక ఫైనల్ గా చెప్పాలి అంటే అందరికి తెలిసిన కథనే ఎమోషనల్ టచ్ తో తెరకెక్కిద్దామన్న దర్శకుడు సతీష్ ప్రయత్నం పూర్తి స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిందనే చెప్పాలి.అక్కడక్కడా కొన్ని టచ్ చేసే ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ ఆకట్టుకోగా కొన్ని అనవసరమైన సీన్స్ సాగదీతగా సాగే కథనం సినిమా చూసే ప్రేక్షకుడికి ఇంపుగా అనిపించవు.తన జీవితంలో మూలాలను వెతికే ప్రయత్నంలో చేసిన “నివాసి” జర్నీ ఇంకా ఆసక్తికరంగా ఉండాల్సింది.
123telugu.com Rating :  2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు