సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న “ఓ మంచి ఘోస్ట్” నుండి పైసా రే పైసా సాంగ్

omg

ప్రపంచాన్ని నడిపిస్తుంది రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కాదు డబ్బు. ప్రపంచాన్ని శాసిస్తున్నది అక్షరాల డబ్బు మాత్రమే అనే కాన్సెప్ట్ తో ఓ మంచి ఘోస్ట్ (OMG) చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగల్ నెట్టిట్లో రచ్చ చేస్తుంది. త్వరలో మనముందుకు రాబోతున్న ఓ మంచి ఘోస్ట్ సినిమాలో ప్రస్తుతం డబ్బు ప్రాముఖ్యత పై అద్భుతమైన, అంతే చమత్కారమైన పాటను రాసి పాడారు ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. అనూప్ రూబెన్స్ తో పాటు శ్రీనివాస్ చింతల ఈ పాటకు రచయితలుగా పనిచేశారు. మంచి బీట్ తో ఉన్న ఈ సాంగ్ కు డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ కొరియోగ్రాఫీ పై ఈ పాట, డబ్బు మన జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో చెబుతుంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

డబ్బు చుట్టు లోకం తిరుగుతుంది, నీతో పట్టి చాకిరి చేస్తుంది, రౌండు రౌండ్ గోల్ తిప్పుతుంది నిన్ను, మత్తులో ముంచేస్తుంది. అంటూ సాగే ఓ మంచి ఘోస్ట్ సినిమా నుంచి పైసా రే పైసా రే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ శనివారం విడుదల చేసారు.

హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఓ మంచి ఘోస్ట్ చిత్రం నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తుండగా, తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో ఉపేస్తూ, శ్రోతల్ని ఉర్రుతలుగిస్తుంది. ఈ చిత్ర ప్రారంభం నుంచి చివరి వరకు ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ కథలో కామెడీతో పాటు ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టే హారర్ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు.

వెన్నెల కిషోర్, షకలక శంకర్, నందితా శ్వేత, నవమి గాయక్, నవీన్ నేని, రజిత్ రాఘవ్, రఘు బాబు, నాగినీడు, బాహుబలి ప్రభాకర్, షేకింగ్ శేషు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు శంకర్ మార్తాండ్, నిర్మాత డా.అబినిక ఐనాభాతుని, బ్యానర్ మార్క్ సెట్ నెట్ వర్క్స్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ, ఎడిటర్ ఎమ్ ఆర్ వెర్మ, ఆర్ట్ డైరెక్టర్ సుప్రియ, పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే, పాట రచయిత అనూప్ రూబెన్స్, శ్రీను చింతల, కొరియోగ్రఫర్ బాబా భాస్కర్, విజువల్ ఎఫఎక్ట్స్ విక్టర్, కళ్యాణ్, విజయ్, పీఆర్ఓ హరీష్ – దినేష్, డిజిటల్ పీఆర్ఓ మనోజ్ తాడి లుగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version