మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ చిత్రానికి సాలిడ్ ఓవర్సీస్ డీల్ జరిగినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు ఏకంగా రూ.20 కోట్ల మేర ఓవర్సీస్ డీల్ ఖాయమైనట్లు తెలుస్తోంది. దీంతో నార్త్ అమెరికాలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 3.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంది. ఇక మొత్తం ఓవర్సీస్‌లో 4.75 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ బరిలోకి దిగనుంది.
ఔట్ అండ్ ఔట్ కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాలో అందాల భామ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా కేథరిన్ త్రేజా మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు.
