హౌజ్‌ఫుల్ బోర్డులతో బాస్ క్రేజ్.. శంకర వరప్రసాద్ గారు తగ్గడం లేదుగా..!

msf

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ పండుగకు రిలీజ్ అయిన చిత్రాల్లో టాప్ ఫేవరెట్ చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా థియేటర్లలో నవ్వులు పూయిస్తోంది. ఇక ఈ సినిమాతో వింటేజ్ మెగాస్టార్ అభిమానులను థ్రిల్ చేస్తున్నారు.

ఈ సినిమా జనవరి 12న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కాగా, వారం రోజుల తర్వాత కూడా ఈ చిత్రం తన జోరును చూపిస్తుంది. పండుగ సెలవులు ముగియడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో చాలా ప్రాంతాల్లో థియేటర్లు హౌజ్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర బాస్ క్రేజ్ ఎలాంటిదో మరోసారి ప్రూవ్ అయిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా, విక్టరీ వెంకటేష్ క్యామియో పాత్రలో అలరించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version